గాయత్రీపురంలో ఘనంగా గోరింటాకు సంబరాలు
- ఆషాఢ మాసం సందర్భంగా మహిళలతో కలిసి ప్రత్యేక పూజలు
- సాంప్రదాయ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ పవన్ కుమార్
నాగోల్, జూలై 22 (విజయక్రాంతి): కొత్తపేట్ డివిజన్ గాయత్రీపురంలోని వినాయక ఆలయం వద్ద రంగారెడ్డి జిల్లా అర్బన్ మహిళా మోర్చా అధికార ప్రతినిధి సరికొండ లావణ్య ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గోరింటాకు సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తపేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్, వైష్ణవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మహిళలకు ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళల ఐక్యత, కుటుంబ విలువలు, సాంప్రదాయాల పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు మంచి రాజేష్ కుమార్, రంగారెడ్డి జిల్లా అర్బన్ ఉపాధ్యక్షురాలు నందికొండ గీతారెడ్డి, కౌన్సిల్ మెంబర్ కాటా విజయ గౌడ్, స్వర్ణ, యశోద, పుష్పమాల, రాధిక, బీజేపీ కార్యకర్తలు, మహిలు, కాలనీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






