23 July, 2026 | 1:51 AM

రాహుల్ అరెస్ట్.. మోడీ నిరంకుశత్వానికి నిదర్శనం

23-07-2026 12:00 AM
  1. తుంబూరు దయాకర్ రెడ్డి
  2. ఏదులాపురంలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం

ఏదులాపురం, ఖమ్మం , జులై 22(విజయక్రాంతి): పోటీ పరీక్షల లీకేజీలతో దేశం లోని లక్షలాది మంది విద్యార్థుల, నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేస్తూ, వారి తరఫున ప్రశ్నిస్తున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అక్రమంగా అదుపులోకి తీసుకోవడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మంత్రి పొం గులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి మండిపడ్డారు.

విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసినందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాన మం త్రి నరేంద్ర మోదీ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చే శారు. రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్ను ఖం డిస్తూ ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో బుధవారం భారీ నిరసన కార్యక్ర మం నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ... పేపర్ లీకేజీల వల్ల కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఖమ్మం రూరల్ మండల, ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.