23 July, 2026 | 1:49 AM

ఉత్తమ ఫలితాలు సాధిస్తే విద్యార్థులకు లాప్‌టాప్ అందజేస్తా..

23-07-2026 12:00 AM

కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్

సికింద్రాబాద్, జూలై 22 (విజయక్రాంతి): విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. న్యూ బోయి నపల్లి సాయి గ్రామర్ హైస్కూల్‌లో విద్యార్థులకు ఈరోజు నోటుబుక్స్, స్టేషనరీ ఐటమ్స్,పాఠశాల ఆయాలకు ఇందిరమ్మ చీరలు జంపన ప్రతాప్ అందజేశారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ 2026-27 విద్య సంవత్సరంలో పదవతరగతి పరీక్ష ఫలితాల్లో 90 శాతంకు పైగా మార్కులు సాధించిన  విద్యార్థులకు లాప్టాప్ అందజేస్తానని జంపన ప్రతాప్ తెలియజేశారు.

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని తల్లితండ్రులు, ఉపాధ్యా యులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రత్నమాల,జి.శారదా దేవి, ఉపాధ్యాయులు శశిరేఖ,రజిత, పద్మావతి, ఇంద్రసేన రెడ్డి,రాధా,ఝాన్సీ రాణి,ఫారజానా బేగం, స్థానికులు కరణ్ సింగ్, శరత్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.