06-10-2025 12:00:00 AM
ఆదిలాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో శ్రీ శారదా దేవి, బతుకమ్మల నిమజ్జనోత్సవం ఘనంగా కొనసాగాయి. శరన్నవరాత్రి ఉత్సవాల సం దర్భంగా ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాలకు, బతుకమ్మల దసరా పండుగ తర్వాత నిమజ్జనాలు చేపట్టడం జిల్లాలో అనవాయితీ వస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో వాడవాడలా గత 3 రోజులుగా నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా బతుకమ్మ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు, యువతులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను బతుకమ్మ గద్దెల వద్దకు తీసుకువచ్చి, బతుకమ్మ పాటలకు అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు.కోలాటాలు, డీజేసౌండ్‌లకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నారు.