calender_icon.png 6 October, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఎన్టీయూ పైవంతెనపై రోడ్డు ప్రమాదం.. ఆరుగురికి గాయాలు

06-10-2025 08:30:36 AM

హైదరాబాద్: కూకట్‌పల్లి జేఎన్టీయూ(JNTU) పైవంతెనపై సోమవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. అతివేగంతో దూసుకొచ్చిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని రోడ్డుకు అవతలి వైపు కారు బోల్తా కొట్టింది. రోడ్డుకు అవతలి వైపు బోల్తాపడిన కారును మరో కారు ఢీకొట్టింది. కారులో చిక్కుకున్న డ్రైవర్ ను అరగంట పాటు శ్రమించి పోలీసులు బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.