calender_icon.png 6 October, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నియమాలు పాటించాలి

06-10-2025 12:00:00 AM

- వైద్య సిబ్బంది వీధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు

- కలెక్టర్ హైమావతి 

బెజ్జెంకి, అక్టోబర్ 5:  స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికల కోడ్ అమలులో ఉందని, నియమాలు తప్పనిసరిగా పాటించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. ఆదివారం బెజ్జంకి మండలం తోట పల్లి శివారులోని రాజీవ్ రహదారిపై ఏర్పా టు చేసిన ఎస్‌ఎస్ టి శిబిరాన్ని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి ఆది వారం క్షేత్రస్థాయిలో పరీశిలించారు. రిజిస్టర్ వెరిఫై చేశారు.

స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి వాహనాన్ని క్షుణ్ణం గా తనిఖీ చేసిన ప్రక్రియ వీడియో తియ్యాలని ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుం డా అత్యంత పారదర్శకంగా ఎన్నికల విధు లు నిర్వహించాలని శిబిర అధికారులను ఆదేశించారు.అనంతరం బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి రోగులకు అందిం చే వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

స్టాఫ్ నర్స్ పద్మ తప్ప ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ వీక్ ఆఫ్ ఇతర సిబ్బంది సైతం సెలవులో ఉన్నందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వైద్యం చేసేందుకు సిబ్బంది తప్పనిస రిగా డ్యూటీలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారిని ఫోన్ ద్వారా అదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజావాణి బంద్..

స్థానిక సంస్థల ఎన్నికల నియమావలళీ అమలులో ఉన్నందున 6 వ తేదీన సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు కలెక్టరేట్ లో నిర్వ హించే  ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినందున ప్రజావాణి కార్యక్ర మం కోసం కలెక్టరేట్ కు ఎవరు రావద్దని  జిల్లా కలెక్టర్ కోరారు.