16 August, 2026 | 6:56 PM

ఘనంగా 124వ గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం, గాయత్రి జపం, తర్పణం

16-08-2026 06:17 PM

హైదరాబాద్: దూర్వా గణపతి చవితి 16-8-2026 ఆదివారం వరసిద్ధి వినాయక దేవాలయం, గాయత్రి పురం కాలనీ, కొత్తపేటలో లోక శాంతికై అన్యోన్య బ్రాహ్మణ సహాయంతో 124వ గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం, అక్షర లక్ష గాయత్రి జప యజ్ఞంలో భాగంగా గాయత్రి జపం, తర్పణం, ఎంతో భక్తి శ్రద్దలతో జరిగినది. ఈ నెల 29-8-2026 శనివారం వరకు 24 లక్షల గాయత్రి జపం పూర్తి చేసి గాయత్రి హోమం, సువర్ణ భారతీ గోశాలలో వేలాది మంది వేద పండితుల మధ్య జరుగును. దానిలో భాగంగా ఈరోజు అభిషేకం, జపం, తర్పణం  నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వైద్య భాస్కర్, శ్రీనివాస్, పవన్, దేవిప్రసాద్, హేమా, సుజాత, గీత పాల్గొన్నారు.

ఇట్లు 

వినోద్ కుమార్ మహావాది.

అద్యక్షులు తెలంగాణ రాష్ట్ర గాయత్రి ఉపాసన సంస్థ 

9000013755