16 August, 2026 | 7:09 PM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గం అధ్యక్షులుగా ఉప్పు హనుమంతరావు

16-08-2026 06:23 PM

ఘనంగా సత్కరించిన కాంగ్రెస్ నాయకులు మట్టా

సత్తుపల్లి ఆగస్టు16 (విజయక్రాంతి): జాతీయ బీసీ సంక్షేమ సంఘం సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులుగా నియమితులైన ఉప్పు హనుమంతరావు కు సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పు హనుమంతరావును రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ శాలువాలతో సత్కరించి,అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీల హక్కులు, సంక్షేమం కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సత్తుపల్లి నియోజకవర్గంలో సంఘాన్ని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. బీసీ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని సూచించారు.

నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, బీసీల ఐక్యత, హక్కులు, ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని ఉప్పు హనుమంతరావు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ కు మరియు నాయకులకు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి టౌన్ అధ్యక్షులు గాదె చెన్నారావు, కమల్ పాషా, అలవాలా కరుణాకర్ బాజీ, దేవల్ల శ్రీను, ప్రసాద్ తదితరులు పాల్గొని ఉప్పు హనుమంతరావు ‌కు శుభాకాంక్షలు తెలిపారు.