అంబేద్కర్‌కు ఘన నివాళి
కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్‌లో నిర్వహణ
నిజామాబాద్, ఏప్రిల్ 14(విజయక్రాంతి): కెనరా బ్యాంక్ నిజామాబాద్ రీజినల్ ఆఫీస్‌లో రాజంగా నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్‌లో గల స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల హాస్టల్ పిల్లలకు బ్లాంకెట్స్, పండ్లు, బిస్కెట్ పాకెట్స్‌లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ నిజామాబాద్ రీజినల్ హెడ్ కే వినోద్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ మన భారతదేశ రాజ్యాంగ నిర్మాణంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించారని, ఎన్నో కష్టనష్టాలు ఉన్న ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్క పౌరుడు భవిష్యత్ తరాలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని వారిని ఆదర్శంగా తీసుకొని దేశసేవ చేయాలని అన్నారు. కార్యక్రమంలో డీఎంలు ప్రదీప్ తోరట్,రాఘవ, స్నేహ సొసైటీ నిర్వాహకులు ఎస్ సిద్దయ్య,కెనరా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.






