6 September, 2026 | 11:21 AM

సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులు

22-08-2026 | 05:58pm

ముకరంపుర, ఆగస్టు 22(విజయ క్రాంతి): కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సురవరం చిత్రపటానికి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ వర్ధంతికి ముఖ్య అతిధిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబం మొత్తం కమ్యూనిస్టు భావజాలం,అభ్యుదయ భావాలతో నిండి ఉందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి ప్రజా పోరాటాలలో పార్లమెంటరీ వ్యవస్థలలో పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడిన నిబద్ధత గల కమ్యూనిస్టు అగ్ర నాయకుడు సురవరం అని ఆయన ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు నేటి తరం కమ్యూనిస్టులు సిద్ధం కావాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు