వేములవాడ కోర్టులో ఘనంగా ఉగాది వేడుకలు
ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి : జ్యోతిర్మయి హాజరు
వేములవాడ, మార్చి 19,(విజయక్రాంతి )వేములవాడ కోర్టులో ఉగాది పర్వదినాన్ని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గుడిసె సదానందం ఆధ్వర్యంలో గురువారం ఘ నంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి పాల్గొన్నారు.ఈ సందర్భంగా న్యాయవాదు లు, కోర్టు సిబ్బంది పరస్పరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
సంప్రదాయ బద్ధంగా ఉగాది పచ్చడి పంపిణీ చేసి పం డుగ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా జడ్జి జ్యోతిర్మయి మాట్లాడుతూ ఉగా ది కొత్త ఆరంభాలకు సంకేతమని, ప్రతి ఒక్క రూ సానుకూల దృక్పథంతో ముందుకు సా గాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనా రాయణ రెడ్డి, ఏజీపీ భాను కృష్ణ, సీనియర్ న్యాయవాదులు పొత్తూరు అనిల్ కుమార్, కందుల క్రాంతి కుమార్, పర్లపెల్లి అంజయ్య, గోగికారి శ్రీనివాస్, వంగల కర్ణ, సుంకపాక నవీన్, గొంటి శంకర్, కనికరపు శ్రీనివాస్, కనపర్తి రాజశేఖర్, ఎం. అనిల్ కుమార్, నాగేంద్రబాబు, బీమా మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.




