బామ్మ వర్కౌట్స్‌కు ఫిదా!
చైనాకు చెందిన ఈ బామ్మ పేరు లీ. ఆమెకు పుష్ అప్, సిట్ అప్‌లు చేయడం వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు వేస్తుందామె. ఇరవై, ముప్పులలో ఉండే యువత సైతం చేయడానికి ఇబ్బందిపడే కష్టతరమైన వర్కౌట్లన్ని బామ్మ లీ హుషారుగా చేసేస్తుంది. ఆమె హునాన్ ప్రావిన్స్‌లోని జియాంగ్వా యావో అటానమస్ కౌంటీలో నివసిస్తోంది. నిజానికి ఆ ప్రాంతంలో నిరంతరం వర్షాలు పడుతూనే ఉంటాయి. అయితే ఆ వర్షం కూడా ఆమె ఉత్సాహాన్ని నియంత్రించలేపోయింది.
అంటే ఆమె తన వ్యాయామాలు ఇంట్లోనే చేసుకునేలా చక్కగా సర్దుబాటు చేసుకుంది. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ఆమె అభిరుచి అని చెప్పొచ్చు. అంతలా నిబద్ధతతో చేస్తోందా బామ్మ. పైగా ఆమె ప్రతిరోజూ 200 పుష్, అప్‌లు, 100 సిట్, అప్‌లు మిస్‌అవ్వకుండా చూసుకుంటుదట. జూన్ ప్రారంభంలో యావో ఎత్నిక్ మైనారిటీ మెడిసిన్ ఫెస్టివల్ సందర్భంగా ఆ బామ్మ తన ఆరోగ్యకర అలవాట్లు వెలుగులోకి వచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
అంతేకాదు ఆమె తన దీర్ఘాయువు సీక్రెట్‌ని కూడా షేర్ చేసుకుంది. ప్రతి రోజూరాత్రిపూట పాదాలను వేడినీళ్లలో ఉంచే అలవాట్లతో కాళ్ల నొప్పులను తగ్గించుకున్నానంటోంది. మంచి ఆహారపు అలవాట్లతో జుట్టు నెరిసిపోకుండా చూసుకుంటుందట. ఇక తన చలాకి కదలికలకు కారణం 1959లో చాంగ్షాలోని కళాశాల నుంచి పట్టభద్రురాలైన వెంటనే కిండర్ గార్డెన్ టీచర్‌గా పనిచేయడమేనని అంటోందామె.
ఎందుకంటే పిల్లలు కదలికలు చాలా అద్భుతంగా ఉంటాయి. వారిలో ఉండే చురుకుదనం తనకెంతో ఇష్టమని అంటోంది. అలాగే యాక్టివ్‌గా జీవితాంతం ఉండాలనే ఆకాంక్ష.. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేసిందని అంటోంది బామ్మ లీ. వయసుతో పాటు మన శరీర కదలికలు తగ్గుతాయి.
దాన్ని గమనించి మంచి ఆరోగ్య అలవాట్లు.. జీవనశైలిని సరిచేసుకుంటే.. వృద్ధాప్యంలో ఎవర్విపై ఆధారపడకుండా.. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆశ్వాదించ గలమని చెబుతున్నది ఈ బామ్మ.. బామ్మ వర్కౌట్స్‌కు ఈ తరం యువత ఫిదా అవ్వడమే కాదు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






