గ్రాండ్‌మాస్టర్ వైశాలీ

02-05-2024 12:58:07 AM

చెన్నై: క్యాండిడేట్స్ టోర్నీలో సత్తాచాటిన భారత చెస్ ప్లేయర్ ఆర్ వైశాలీ అధికా రికంగా ‘గ్రాండ్‌మాస్టర్’ హోదా పొందింది. తద్వారా కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తర్వాత గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న మూడో మహిళా ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. వైశాలీ సోదరుడు ప్రజ్ఞానంద ఇప్పటికే గ్రాండ్‌మాస్టర్ హోదా సొంతం చేసుకోగా.. ఇప్పుడు అదే ఇంటి నుంచి వైశాలీ కూడా జీఎం హోదా సాధించింది. గత నెలలోనే వైశాలీకి ఫిడే కౌన్సిల్ గ్రాండ్ మాస్టర్ హోదా ప్రకటించగా.. తాజాగా లోబ్రెగాట్ ఓపెన్‌లో ప్రదర్శన ద్వారా వైశాలీ 2500 ఎలో రేటింగ్ పాయింట్లు అధిగమిం చి అధికారికంగా గ్రాండ్‌మాస్టర్‌గా అవతరిం చింది. ‘మహిళా గ్రాండ్‌మాస్టర్ టైటల్ దక్కినప్పుడే ఏదో ఓక రోజు గ్రాండ్‌మాస్టర్ హోదా సాధిస్తానని అనుకున్నా. దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. ప్రజ్ఞానం దతో ఆట గురించి బాగా చర్చిస్తా. చిన్నతనం నుంచి కలిసి ఆడటంతో ఒకరి ఎత్తులపై మరొకరికి అవగాహన ఉంది. అలాంటి కఠిన ప్రత్యర్థి ఇంట్లో ఉండటం వల్లే మరింత రాటు దేలగలిగా’ అని వైశాలీ వెల్లడించింది.