మా అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
జాయింట్ కలెక్టర్ అంకిత్‌కు విజ్ఞప్తి చేసిన సర్పంచ్
ఏర్గట్ల, డిసెంబర్ 29 (విజయ క్రాంతి): ఏర్గట్ల మండలం లోని బట్టా పూర్ గ్రామ సర్పంచ్ భూషణవేణి ప్రవీణ్ యాదవ్,వ ఉపసర్పంచ్ మూడ్ దయానంద్ తమ గ్రామంలో ఉన్నా సమస్యలు, గ్రామ అభి వృద్ధికి కావాల్సిన నిధుల మంజూరి గురించి అదనపు కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను సోమవారం నిజామాబాద్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో కలిసి వినతిపత్రం అందజేశారు. బట్టాపూర్ గ్రామంలో రైతులకు గోదాం నిర్మాణం, ఇందిరమ్మ కాలనీతోపాటు గ్రామంలో సిసి రోడ్డులు, డ్రైనేజిల నిర్మాణం, హైటెన్షన్ విద్యుత్ తీగల తొలగించడం, నలభై ఐదు విద్యుత్ స్తంబాలు, గ్రామంలో అరవై వేల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణం, క్రొత్త రేషన్ కార్డులు, పెన్షన్‌లు మంజూరితో పాటు పలు సమస్యలను తీర్చడానికి, అభివృద్ధి పనులకు నిధులు మంజూరి అయ్యేలా కృషి చేయాలనీ విజ్ఞప్తి చేసారు.






