30-12-2025 12:24:34 AM
చూడొద్దని మండలి చైర్మన్ సూచన
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): శాసనమండలి శీతాకాల సమావే శాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే సభ నడిచే సమయంలో మండలిలో కొందరు సభ్యులు తమ సెల్‌ఫోన్లు చూస్తుండటాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గమనించారు. సభలో సభ్యు లు సెల్‌ఫోన్లను వాడొద్దని, నిషేధం ఉందన్నారు. సభ్యులు ఈ విషయాన్ని గుర్తుం చుకోవాలని చైర్మన్ సూచించారు. అనంతరం స్పెషల్ మెన్షన్స్‌తో పాటు పిటిషన్లను తీసుకున్న తర్వాత సభను జనవరి 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.