calender_icon.png 30 December, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్సీలకు సభ్యుల సంతాపం

30-12-2025 12:22:41 AM

  1. జగపతిరావు, షబీర్‌కు నివాళి
  2. సేవలను గుర్తు చేసుకున్న శాసన మండలి

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ శాసనమండలి శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కాగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి సభ్యులుగా పనిచేసి ఈ మధ్య మరణించిన ఇద్దరు సభ్యులకు సభ సంతాపం తెలిపింది. నాగర్‌కర్నూల్ జిల్లా చందుపట్ల గ్రామంలో 1944 జనవరి 15న జన్మించిన మాధవరం జగపతి రావు మృతికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.

పాఠశాల హెడ్‌మాస్టర్‌గా ఉద్యోగం చేస్తున్న జగపతి రావు 1984-85లో ఉమ్మడి ఏపీ శాసనపరిషత్ సభ్యుడిగా పనిచేశారని చైర్మన్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 26న మరణించిన జగపతి రావుకి సభ సంతాపం తెలుపుతుందన్నారు. అదేవిధంగా 1947 అక్టోబర్ 24న హై దరాబాద్‌లో జన్మించిన అహ్మద్ పీర్ షబ్బీర్ మృతికి సైతం సంతాపం ప్రకటించారు. ఈయన 2008 కాలంలో కాంగ్రెస్ పార్టీ తరపున శాసన పరిషత్  సభ్యుడిగా కొనసాగారని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో మరణించిన షబ్బీర్‌కి సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలపాటు సభ మౌనం పాటించి సంతాపం తెలిపారు.