17 April, 2026 | 11:49 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

23-04-2025 12:58 AM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండ, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): హసన్ పర్తి ఎమ్మార్వో ఆఫీస్ నుంచి ఎల్లాపూర్ గ్రామం వరకు రోడ్డు చిన్నగా ఉండి రోడ్డు ప్రమాదంలో చాలా మంది మరణిస్తున్నారనీ స్థానికుల అభ్యర్థన మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సంబంధిత అధికారులతో వివరాలు తెప్పించుకొని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత రోడ్డు భవనాలు శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ల దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే స్పందించి రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు తక్షణమే 2 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది.

ఈరోజు ప్రత్యక్షంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే  కేఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, నేషనల్ హైవే, పోలీస్, మున్సిపల్, ఎలక్ట్రికల్, అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్వయంగా పర్యవేక్షించి అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. 

ఎమ్మెల్యే దృష్టి సారించి ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టి 2 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి, రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని తెలియజేయడంతో స్థానిక ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నాగరాజు కు, నాయకులకు  అధికారులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. 

హనుమకొండ జిల్లా కిసాన్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి,  హాసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, ఆత్మకూర్ ఏఎంసి మాజీ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి, 66వ డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్, అయ్యాల రాంరెడ్డి, మండల, డివిజన్, గ్రామ స్థాయి నాయకులు  కార్యకర్తలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.