2 July, 2026 | 3:59 AM

యూరియా యాప్‌ను వెంటనే తొలగించాలి

02-07-2026 02:47 AM

మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి

యాదగిరిగుట్ట జూలై 1 : రైతులు యూరియా కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన యాప్తో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆ యాప్ను వెంటనే తొలగించాలని మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం యాదగిరిగుట్ట పీఏసీఎస్ కార్యాలయంలో పశువుల దాణా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ యూరియా యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చిన్న ఫోన్లు ఉన్న రైతులు యూరియా ఎక్కడ బుక్ చేసుకోవాలనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.

పార్టీలకతీతంగా యూరియా యాప్ తొలగించేందుకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి మాట్లాడుతూ మేము బాధ్యతలు చేపట్టిన సమయంలో సొసైటీ పూర్తి నష్టాల్లో ఉందని, అలాంటి సొసైటీ ఇప్పుడు రూ.30 కోట్ల టర్నోవర్తో సంవత్సరానికి రూ,కోటి లాభంతో సొసైటీ నడుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ స్కీం కింద సొసైటీని ఎఫ్పీవో అలాటైందని, అందులో భాగంగా ఫీడ్ బజార్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.

రైతులందరి సహకారంతో ఫీడ్ బజార్ను విజయవంతంగా నడిపిస్తామన్నారు. రుణమాఫీని మొత్తం చేయాలని, సకాలంలో రైతు బంధు వేయాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పాలకమండలిలో జిల్లా నుంచి ఒక్కరిని కూడా ఎన్నుకోకపోవడం శోచనీయమని, ఇక్కడి రైతులు దేవాలయం అభివృద్ధికి భూములిచ్చారని, ఇప్పటికైనా జిల్లా నుంచి ఒకరికి చోటు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రామిరెడ్డి డైరెక్టర్లు రైతు సమితి సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.