2 July, 2026 | 3:13 AM

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

02-07-2026 02:32 AM

వాంకిడి, జూలై 1 (విజయక్రాంతి): నాటిన మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, వాంకిడి ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్ జాబరె పెంటయ్య సూచించారు. వాంకిడి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయం ఆవరణలో స్థానిక సర్పంచ్ సి.హెచ్ సతీష్ తో కలిసి బుధవారం ఆయన మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలు చెట్టుగా ఎదిగేం దుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరా రు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు వాంకిడి మాజీ సర్పం చ్ బి.తుకారం, దాబ కొట్నాక జంగు, చిచ్చు పల్లి k. జంగు, సరండి సర్పంచ్ మొహూర్లే బాపూజీ, సీఈవో మొహూర్లే ఓమాజీ, డైరెక్టర్ దిగంబర్, టిఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు ఎంగిలి రాకేష్, అశు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.