11 May, 2026 | 2:19 AM

ఇంటర్ బోర్డు నిర్ణయంపై సీఎంకు కృతజ్ఞతలు

11-05-2026 01:23 AM

ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయాలనే నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డా.పీ. మధుసూదన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.

తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంటర్ బోర్డ్, ఇంటర్ విద్యా విధానంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇంటర్ జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డిని నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.