11 May, 2026 | 2:20 AM

తలసేమియా నివారణపై అవగాహన

11-05-2026 01:21 AM

అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం- సందర్భంగా బైక్ ర్యాలీ

ముషీరాబాద్, మే10 (విజయక్రాంతి): ప్రపంచ తలసేమియా దినోత్సవం -2026 సందర్భంగా ఆదివారం నగరంలో తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ(టీఎస్ సీఎస్) అవగాహన కార్యక్రమాన్ని స్వచ్ఛంద రక్తదాన శిబిర నిర్వాహకుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టీఎస్‌సీఎస్ అధ్యక్షుడు డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సీఈఓ, సెక్రటరీ డాక్టర్ సుమన్ జైన్, వైస్ ప్రెసిడెంట్ రత్నవల్లి కొత్తపల్లి, జాయింట్ సెక్రటరీ మిస్టర్ అలీమ్ బేగ్‌లతో కలసి ఆయన మాట్లాడుతూ ఈ వేడుకల్లో భాగంగా హిడెన్ నో మోర్- అన్మాస్కింగ్ తలసేమియా, ట్రాన్స్‌ఫార్మింగ్ లైవ్స్ పేరుతో భారీ మోటార్ సైకిల్ అవగాహన యాత్రతో 75 మందికి పైగా బైకర్లు పాల్గొన్నట్లు చెప్పారు.

వాండరర్స్ బ్రదర్హుడ్ రైడింగ్ కమ్యూనిటీ మద్దతుతో జరిగిన ఈ అవగాహన ర్యాలీ తలసేమియా నివారణ, స్వచ్ఛంద రక్తదానం, క్యారియర్ స్క్రీనింగ్ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా సాగిందన్నారు. ఈ బైక్ ర్యాలీ హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాల గుండా ప్రయాణించి తిరిగి టీఎస్ సీఎస్ భవనం వద్ద ముగిసినట్లు చెప్పారు.