23 May, 2026 | 3:20 AM

నియోజవర్గ రైతులకు రాయితీపై పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ

23-05-2026 01:53 AM

సత్తుపల్లి, మే 22 (విజయ క్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో  సత్తుపల్లి మండలం, వేంసూరు మండలం  మరియు పెనుబల్లి మండలం చెందిన రైతులకు ‘ రాయితీపై  పచ్చిరొట్ట విత్తనాలు ‘ పంపిణీ చేసిన... సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు  డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసి. చైర్మన్ దోమ ఆనంద్, కల్లూరు ఏఎంసి  చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, వ్యవసాయ శాఖ అధికారులు సత్తుపల్లి , పెనుబల్లి, వేంసూరు మండలం ఏవో. ఏఈఓ. లు, సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలం రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు పాల్గొన్నారు.