13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మరో మహిళా ప్రాధాన్య చిత్రానికి గ్రీన్ సిగ్నల్!

22-03-2026 12:00 AM

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో నటిస్తూ దక్షిణాదిన క్రేజీ హీరోయిన్‌గా మారింది ప్రియాంక అరుళ్ మోహన్. ఇటీవల పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ చిత్రంలో అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘మేడ్ ఇన్ కొరియా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం మార్చి 12న నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది.

టాలీవుడ్ స్టార్ నాగార్జున ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ మూవీగా అభివర్ణించారు.. ప్రియాంక నటననూ అభినందించారు. అయితే, ప్రియాంక అరుళ్ మోహన్ గురించి సోషల్ మీడియాలో తాజాగా ఓ ఆసక్తిర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ భామ మరో మహిళా ప్రాధాన్య చిత్రంలో నటించబోతోందనేది ఆ వార్తల సారాంశం. ‘చక్ర’ ఫేమ్ ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రియాంక ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనున్న ఈ సినిమా థియేటర్ల ద్వారా విడుదల కానుందట.

ఇదిలావుంటే, ప్రియాంక మోహన్ ప్రస్తుతం ‘అరసన్’ చిత్రంలో నటిస్తోంది. దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శింబు కథానాయకుడిగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, ఆండ్రియా జెర్మియా, సముద్రఖని వంటి వారు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. పోలీస్‌స్టేషన్ సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా, ఈ షూటింగ్‌లో ప్రియాంకమోహన్, తదితర తారాగణం పాల్గొంట్నునారు.