13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బావామరదళ్ల గిల్లికజ్జాలు

22-03-2026 12:00 AM

కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీశ్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు కావ్య, శ్రావ్య నిర్మాతలు. ఇందులో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. సాయికుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మార్చి 26న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి శనివారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే లవ్‌స్టోరీగా దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది.

హీరో హీరోయిన్ మధ్య ఉండే ప్రేమ, గిల్లికజ్జాలను హత్తుకునేలా రూపొందించారు. హీరో హర్ష్ రోషన్ తన మరదలైన హీరోయిన్ ప్రేమను గెలవటానికి ఏం చే శాడు? తనకు ఎదురైన సవాళ్లేంటి? వాటిని ఎలా అధిగమించాడు? అనే అంశాలతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్; గీత రచయిత: చద్రబోస్; సినిమాటోగ్రఫీ: సతీశ్ ముత్యాల; స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్: శివ ముప్పరాజు; ఆర్ట్: నార్ని శ్రీనివాస్.