27 March, 2026 | 2:02 AM

నాగర్‌కర్నూల్‌లో నూతన బస్‌స్టేషన్‌కు గ్రీన్‌సిగ్నల్

27-03-2026 12:20 AM

తాగునీరు ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావన. 

నాగర్ కర్నూల్ మార్చి 26 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్లో నిర్మించనున్న నూ తన బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపనకై గ్రీన్ సిగ్నల్ లభించింది. అసెంబ్లీలోని కమి టీ హాల్లో జరిగిన టీజీ ఆర్టీసీ (టీజీ ఆర్టీసీ ) సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఈ అంశంపై చర్చించారు. నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి తక్షణ మే శంకుస్థాపన తేదీ ఖరారు చేయాలని కో రుతూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. తెల్కపల్లి, తిమ్మాజీపేట బస్ స్టాండ్ల దుస్థితిని ఎమ్మెల్యే వివరించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల విన్నపం మేరకు నాగర్ కర్నూల్ నుంచి నల్గొండకు కొత్త బస్సు సర్వీసును ప్రారంభించాలని, నియోజకవర్గంలోని పలు కీలక రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని కూడా కోరినట్లు ఎమ్మెల్యే గురువారం ఓ ప్ర కటనలో తెలిపారు. ఈ సమావేశంలో రవా ణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ (ఐఏఎస్ ), టీజీ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొ న్నారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- ప్రభుత్వం తాగునీటి సమస్యపై స్పందించాలి. 

రాష్ట్ర అసెంబ్లీలో జీరో అవర్ సందర్భంగా నాగర్కర్నూల్ నియోజకవర్గ ప్రజల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ప్రస్తావించారు. జిల్లా కేంద్రంలో విద్యా, వైద్య, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు, ఫ్లోటింగ్ పాపులేషన్ గణనీయంగా పెరిగిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీ స్ స్టేషన్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్హెచ్వోను నియమించాలని ముఖ్యమంత్రిని కలిసి కోరినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన జి.ఓను ముఖ్యమంత్రి జారీ చేసినట్లు పేర్కొన్నారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజ లకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉం డేందుకు నీటిపారుదల శాఖ అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసి నీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత మంత్రిని కోరినట్లు తెలిపారు.