calender_icon.png 19 January, 2026 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.1100 కోట్లతో రిజర్వాయర్‌కు గ్రీన్ సిగ్నల్

19-01-2026 12:17:00 AM

గొల్లపల్లి రిజర్వాయర్ వనపర్తికి వరప్రదాయని 

తెరచాటు రాజకీయాలు ఎందుకు

నాడు జీవో లు నేడు ధర్నాలా

కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూడలేక ఆపసోపాలు

నష్టపరిహారం గతం కంటే ఎక్కువే

గోపాలపేట/రేవల్లి జనవరి18: గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం వనపర్తి జిల్లాకు వరప్రదాయనని ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యశిలారెడ్డి అన్నారు. ఆదివారం గొల్లపల్లి రిజర్వాయర్ పరిసర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం 1100 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు. ఇక్కడ రిజర్వాయర్ చెప్పడం పట్ల వనపర్తి నియోజకవర్గం లోని అన్ని మండలాలు కూడా సస్యశ్యామలంగా అవుతాయన్నారు. ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేందుకు గతంలోనే 2016లో జీవో నెంబర్ 941 జారీ చేసిన విషయాన్ని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటే ఓర్వలేకనే బిఆర్‌ఎస్ లేని పోనీ అపోహాలు చేస్తుందన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుండి చుక్కనీరు కూడా ఇక్కడ రాదని చెప్పారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువే ఇస్తుందని అన్నారు.గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం విషయంలో బి ఆర్ ఎస్ నీతిమాలిన రాజకీయాలకు తెరలేపిందన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ తో పాటు మరో 20 రిజర్వాయర్ల ఏర్పాటుకు 2016 లోనే జీవోలు జారీ చేసిన విషయం మరిచి నేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్నీ సహించలేని కొందరు నీతిమాలిన రాజకీయ లు చేస్తున్నారు. ప్రాజెక్టును వద్దంటూ ధర్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.26/2/ 2018 లో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన మ్యాపింగ్ పూర్తయిందని చెప్పారు.

రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు 6 లక్షల 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించేందుకు కూడా ఆనాటి ప్రభుత్వం ముందుకు వచ్చింది.నేడు అదే గొల్లపల్లి రిజర్వాయర్ను నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు కు రావడానికి సహించలేని కొందరు నీతిమాలిన నాయకులు ప్రాజెక్టు నిర్మాణం వద్దంటూ స్థానిక నాయకులతో ధర్నాలు చేస్తూ తెరచాటు రాజకీయాలకు తెర లేపారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో వనపర్తి నియోజకవర్గంలోని 42,663 ఎకరాలకు సాగు నిరందుతోంది.నేడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు కొడంగల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో కోల్పోయిన రైతులకు ఇచ్చిన నష్టపరిహారం కంటే కొంత ఎక్కువ ఇచ్చేందుకే ముందుకు వచ్చిందని తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో గొల్లపల్లి, చీర్కపల్లి గ్రామాలకు ఎటువంటి ఇబ్బంది లేదని నాటి నిపుణుల బృందం తేల్చి చెప్పిందని వివరించారు.వేల కోట్లు కాంట్రాక్టుల ద్వారా కమిషన్లు తీసుకున్న నాయకులు ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఎందుకు విఫలమయ్యారు సమాధానం చెప్పాలన్నారు. 

గ్రామాల్లోని అమాయక ప్రజలతో ధర్నాలు చేయించడం ఇతర చాటు రాజకీయాలు చేయడం లాంటి ఎన్ని కుయుక్తులు చేసినరిజర్వాయర్ నిర్మాణం ఇక్కడ తప్పకుండా జరిగి తీరుతుంది. గట్టిగా చెప్పారు. ఈ నిర్మాణంతో వనపర్తి నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందని నాయకులు తెలిపారు. వీటితోపాటు గోపాల్పేట చెరువును కూడా రిజర్వాయర్ చేద్దామనుకున్నారు.