19-01-2026 12:17:02 AM
కరింనగర్, జనవరి18(విజయక్రాంతి): ఉమ్మడి కరింనగర్ జిల్లలో రెండు నగరపాలక సంస్థలు , 13 మున్సిపాలిటీ లు ఉండగా కీలకమైన మున్సిపాలిటీ చైర్మన్ స్థానాలు మహిళకుaరిజర్వు కాగా డివిజన్ లు, వార్డుల్లో సగానికిపైగా స్థానాలు దక్కాయి. దీనితో కొత్తవారు తెరమిడికి వచ్చే అవకాశం ఏర్పడింది. కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్-, ఎస్సీ మహిళలకు చొప్పదండి, హుజూ రాబాద్ చైర్మన్ స్థానాలు జమ్మికుంట ఎస్సీ జనరల్ కు దక్కాయి.
సిరిసిల్ల
మున్సిపల్ చైర్పర్సన్ రిజర్వేషన్లు ఈసారైనా మార్పు జరుగుతుందని, పురుషులకు అవకాశం వస్తుందని ఆశగా ఉన్న నేతలకు నిరాశే మిగిలింది. సిరిసిల్ల మున్సి పాలిటీ ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఏడోసారి మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్ స్థానం మళ్లీ మహిళకే అవకాశం దక్కింది. . వేములవాడ పట్టణం మున్సిపల్గా రూపాంతరం చెందిన తరువాత రెండు పర్యాయాలు ము న్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. గత రెండు మున్సిపల్ ఎన్నికల్లో గత ప్రభుత్వం బీసీ మహిళకే రిజర్వేషన్ ఖరారు చేసింది. ఈ సారి బి సి జనరల్ కు దక్కింది.
జగిత్యాల జిల్లాలో చైర్మన స్థానాల రిజర్వేషన్ లు పరిశీలిస్తే జగిత్యాల బీసీ మహిళ, కోరుట్ల జనరల్ మహిళ,రాయికల్ జనరల్ (అన రిజరవ్డ్),మెట్పల్లి జనరల్ (అన రిజరవ్డ్), ధర్మపురి జనరల్ మహిళ కు రిజర్వు అయ్యాయి.
రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్కు రిజర్వు అయ్యింది. ఈ కార్పొరేషన్లో ఇతర వర్గాలకు మేయర్ పదవి అందని ద్రాక్షే అయ్యింది. పెద్దపల్లి, మంథని మున్సిపల్ చైర్మన్ పదవులు బీసీ జనరల్కు, సుల్తానాబాద్ చైర్మన్ జనరల్కు కేటాయించారు. గత ఎన్నికల్లో పెద్దపల్లి జనరల్ మహిళ, సుల్తానాబాద్, మంథని బీసీ మహిళలకు రిజర్వు చేయగా ఈ సారి మారాయి.
సంతోషమే కానీ ఎలా...
కరింనగర్ మేయర్ స్థానం బి సి జనరల్ కావడంతో బి సి నేతల్లో సంతోషం ఉన్నా ఈ పీఠం పై ఆశలు పెంచుకున్న మాజీ ప్రతినిధులకు డివిజన్ ల రిజర్వేషన్లు అనుకూ లించక పోవడం నిరాశ పరచడంతో పక్క డివిజన్ల వైపు చూస్తున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేశ్, చల్ల హరిశంకర్, వాసాల రమేశ్, మల్లికార్జున రాజేందర్ డివిజన్లు మహిళలకు రిజర్వు కావడంతో పక్క డివిజన్లలో పోటీ చేసేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎడ్ల సరిత అశోక్ ప్రాతినిధ్యం వహించిన డివిజన్లతోపాటు సమీపంలోని డివిజన్లలో కూడా పోటీచేసే అవకాశం లేకుండా రిజర్వు అయ్యాయి. . పెద్దపల్లి జితేందర్ డివిజన్ మహిళా రిజర్వుడ్ కావడంతో ఆయన పక్క డివిజన్ వైపు చూస్తున్నాడు. కాంగ్రెస్ నుండి మేయర్ ఆశిస్తున్నా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ కు డివిజన్ కలసి వచ్చింది.