calender_icon.png 19 January, 2026 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన రాష్ట్ర స్థాయి శ్రీపాద కప్ 2026 మెగా క్రికెట్ టోర్నమెంట్

19-01-2026 12:15:37 AM

మంథని, జనవరి18 (విజయ క్రాంతి) మంథని లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి శ్రీపాద కప్ 2026 మెగా క్రికెట్ టోర్నమెం ట్ ఆదివారం ముగిసింది. మంథని పట్టణంలోనీ ప్రభుత్వ కాలేజీ మైదానంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు యువనేత దుద్దిళ్ళ శ్రీను బాబు ఆదేశాలతో ఆర్గనైజర్లు పోలు శివ, పెంటరి రాజు,పెరుగు తేజ పటేల్, టి.రాజు, మారుపాక పవన్, కెక్కర్ల సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి శ్రీపాద కప్ 2026 మెగా క్రికెట్ టో ర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆసక్తిగా సాగింది.జుబేర్ 11 టీమ్ కరీంనగర్ విన్నర్ టీమ్ కు రూ. లక్ష రూపాయలు,ఆల్ రహీం 11 టీమ్ రన్నరప్ కు రూ. యాభై వేల నగదు ను అందించారు.

ఈ సందర్భంగా విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ కి స్పాన్సర్స్‌స్టేజ్ పెంటరీ రాజు (పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు) వివేక్, బాల్స్ ఎరుకల ప్రవీణ్,డీజే లోకే మనోహర్ శరత్ బాబు, వాటర్ శివగంగ ప్యూరిఫైడ్ వారు మేడగోని శ్రీనివాస్ గౌడ్,షీలడ్స్ ఎండీ జమీల్ అహ్మద్ (టిపిసిసి మైనార్టీ సెల్ సెక్రెటరీ) అందజేశారు. అనంతరం నా యకులు మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు. ఆటలు శారీరకంగా, మానసికంగా ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పారు.

రాబోయే రోజుల్లో కూడా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతామని ఆర్గనైజర్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు క్రీడాకారులను అనుక్షణం ప్రోత్సహిస్తున్నారని, ఇదే మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి నెట్ ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఓపెన్ జిమ్, టెన్నిస్ కోర్టు ఏర్పటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజులలో మంథని ప్రాంతంలో క్రీడాకారుల కోసం స్టేడియం ఏర్పాటు కు స్థల సేకరణ జరుగుతుందన్నారు. వారి మార్గంలోనే తాము నడుస్తున్నామని, టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి ఆటగాడు తమ ప్రతిభను కనబరిచారని ప్రశంసించారు. 

మంథని పట్టణం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్య క్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ న్ కుడుదుల వెంకన్న, ఆర్టిఐ మెంబర్ మంథని సురేష్, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమి టీ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, విద్యుత్ ని యంత్రణ మండలి సభ్యులు శశిభూషణ్ కాచే, మాజీ సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదరి శంకర్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జీ ఆరెల్లి కిరణ్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు