15 June, 2026 | 7:59 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

గిరిజన గురుకుల పాఠశాలకు గ్రీన్కో ఫౌండేషన్ కంప్యూటర్ల అందజేత

09-04-2026 12:59 AM

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో కంప్యూటర్ల పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): వరద ముంపుకు గురైన గిరిజన గురుకుల పాఠశాల కు గ్రీన్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కంప్యూటర్లను పంపిణీ చేశారు. నాగిరెడ్డిపేట చెందిన  గిరిజన గురుకుల పాఠశాల కామారెడ్డి సమీపంలోని సరంపల్లి వద్ద నిర్వహిస్తున్నారు. ఇటీవల కామారెడ్డి లో వరదలు వచ్చినప్పుడు గిరిజన గురుకుల పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ వరద నీటికి కొట్టుకపోయింది. కంప్యూటర్లు పాడైపోయాయి.

ఈ విషయాన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అమర్ సింగ్  కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి గ్రీన్కో ఫౌండేషన్ కు తెలపడంతో వారు సానుకూలంగా స్పందించి  కంప్యూటర్లను కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ సమక్షంలో ప్రిన్సిపల్ అమర్ సింగ్ కు అందజేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రీన్కో ఫౌండేషన్ ప్రతినిధులకు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.