18-11-2025 12:26:15 AM
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, ఫి ర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులను స్వీకరించా రు.
ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ 97 దరఖా స్తులను అందజేశారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆయా శాఖలకు పరి ష్కారం కోసం కలెక్టర్ సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మధుసూదన రాజు, మరియన్న, విజయనిర్మల, రాజయ్య, నరసింహమూర్తి, దేశి రా మ్, విజయ, యాదగిరి, శ్రీమన్నారాయణ రెడ్డి, వినోద్ సురేష్ పాల్గొన్నారు.