18-11-2025 12:27:33 AM
టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
కొండాపూర్, నవంబర్ 17 : కొండాపూర్ మండల పరిధిలోని తెర్పోల్ గ్రామ సొసైటీ కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళారులకు రైతులు ధాన్యం అమ్మి మోసపోకూడదని, రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం బోనస్ తో కొనుగోలు చేస్తుందని తెలిపారు. అలాగే రైతులు వరి ధాన్యాన్ని తేమ లేకుండా ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు,ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, కొండాపూర్ మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి, కొండాపూర్ జనరల్ సెక్రటరీ నర్సింలు,వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుదాస్, సొసైటీ చైర్మన్లు మాణిక్ రెడ్డి, రాంరెడ్డి, డైరెక్టర్ రాజు ,మాజీ యూత్ ప్రెసిడెంట్ సునీల్, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అశోక్, నాగేష్,మహేందర్ పార్టీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.