13 March, 2026 | 11:04 AM

అయ్యప్ప స్వామి దేవాలయానికి భూమి పూజ

04-11-2025 01:44 AM

రూ.1.35 కోట్లతో నిర్మాణం : ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్ పూర్, నవంబర్ 3 అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవాలయం గుట్ట పైన ఒక కోటి 35 లక్షల రూ పాయల అంచనా వ్యయం తో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించబోతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సో మవారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, అయ్యప్ప భక్తుల సమక్షంలో వేద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య ఎమ్మెల్యే జిఎంఆర్ భూమి పూజ నిర్వ హించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో నూతన దేవాలయాల నిర్మాణాలు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో సొంత నిధులతో 200 పైగా దేవాలయాలు నిర్మించడం జరిగిందని తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి భక్తులందరూ విరివిగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.