20 June, 2026 | 4:04 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

అవినీతిని ఉపేక్షించేది లేదు

04-11-2025 01:46 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, నవంబర్ 3 :ఎవరైనా అధికారులు, సిబ్బంది అవినీతి మరకలను అంటించుకుంటే సహించేది లేదని, అధికారులకు అవినీతి ఆలోచన ఉంటే విరమింప చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రజల వద్ద నుంచి డబ్బులను తీసుకోవడం చాలా ప్రమాదం అన్నారు.

అవినీతి అనేది అతిపెద్ద నేరమన్నారు. అవినీతి అనేది ఒక సర్కిల్ లాగా రోజువారీగా తిరుగుతుందని దానిని అంతమొందించకపోతే అది అందరిని ప్రభావితం చేస్తుందన్నారు. జిల్లాలోనీ అన్ని శాఖలపై తాను ప్రత్యేక దృష్టి సారించానని, ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినా, ఏలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఉపేక్షించేది లేదన్నారు. వ్యక్తులు చేసే అనైతిక పనుల వల్ల వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుందని, ప్రజలకు భరోసాగా నిలవాల్సిన బాధ్యత అందరి అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఏ శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి భుజంగారావు, అధికారులు పాల్గొన్నారు.