24 May, 2026 | 12:25 AM

స్మశానవాటిక పనులకు శంకుస్థాపన

24-05-2026 12:00 AM

25 లక్షలతో ఆధునీకరణ పనులు: పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, మే 23 (విజయక్రాంతి): భారతినగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ కాలనీలో నల్లగండ్ల ఎస్సీ బస్తీ స్మశాన వాటిక అభివృద్ధి, సుందరీకరణ పనులకు పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శనివారం శంకుస్థాపన చేశారు. రూ.25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల్లో స్నానపు గదుల నిర్మాణం, సకల సదుపాయాల కల్పన, ఆహ్లాదకర వాతావరణ ఏర్పాటు ఉంటాయని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. మనిషి చివరి దశలో అంత్యక్రియలు ప్రశాంతంగా జరిగేలా స్మశాన వాటికను మహాప్రస్థానం తరహాలో అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామన్నారు. పనుల్లో నాణ్యతకు రాజీ పడొద్దని, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.