24 May, 2026 | 12:26 AM

రౌడీషీటర్లకు పోలీసుల వార్నింగ్

24-05-2026 12:00 AM

సనత్‌నగర్, మే 23(విజయక్రాంతి):- బక్రీద్ పండుగ సమయంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డా కఠిన చర్యలు తప్పవని సంజీవరెడ్డినగర్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌రెడ్డి రౌడీషీటర్లను హెచ్చరించారు. శనివారం రౌడీషీటర్లను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. అందరూ చట్టానికి లోబడి ఉండాలన్నారు. లేకుంటే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు మధుసూదన్, సుధీర్‌రెడ్డిలు పాల్గొన్నారు.