గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ
గ్రామ సర్పంచ్ కన్నం రాధా శ్రీనివాస్ రెడ్డి
కొడంగల్, ఏప్రిల్ 26( విజయ క్రాంతి ): గ్రామ అభివృద్ధికి కీలకమైన నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి పర్సాపూర్ గ్రామంలో భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కొడంగల్ మండల పరిధిలోని పర్సాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ రాధా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సెక్రటరీ సమక్షంలో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ శివకుమార్ గుప్తా మరియు కాడ పత్రిక అధికారి వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిలు గా పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నందాల ప్రశాంతం మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధికి పంచాయతీ భవనాలు ఎంతో ముఖ్యమని ప్రజలకు అవసరమైన సేవలను ఒకే చోట అందించడంలో అవి కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు.
గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ రాధా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నూతన పంచాయతీ భవనం నిర్మాణంలో గ్రామ ప్రజలకు పరిపాలన సేవలు మరింత సులభంగా అందుబాటులో వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శివమ్మ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






