పార్వతి రాజరాజేశ్వర దేవాలయానికి విరాళం
27-04-2026 12:50 AM
కొండాపూర్, ఏప్రిల్ 26: కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో గ్రామానికి చెందిన డప్పు రత్నం జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు డప్పు అనంతయ్య తమ గ్రామంలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర దేవాలయానికి రూ.51,000 విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు అనంతయ్య గారి సేవాభావాన్ని ప్రశంసిస్తూ, రత్నయ్య జ్ఞాపకాన్ని నిలుపుకునే విధంగా చేసిన ఈ దానం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామాల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు, సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.






