26 May, 2026 | 1:55 AM

మహిళా సంఘాల భవనాలకు భూమి పూజ

26-05-2026 12:12 AM

తాడ్వాయి, మే, 25(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి, సంగోజివాడి గ్రామాల లో సోమవారం మహిళా సంఘాల భవనాలకు ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక్కో మహిళా సంఘానికి ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు.

గతంలో మహిళలు సరైన సంఘ భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు.ప్రభుత్వం స్పందించి సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేయడం ఎంతో బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు నరేష్, తాజోద్దీన్,  సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.