10 May, 2026 | 5:15 AM

గ్రూపు- 1 ఫలితాలను వర్గీకరణ ప్రకారం ప్రకటించాలె

30-08-2024 02:04 AM
  1. దాని ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలె 
  2. మాల మేధావులు వర్గీకరణను అడ్డుకోవద్దు 
  3. చట్ట సభల్లోకి స్వతంత్రంగానే వెళతా
  4. మీట్ ది ప్రెస్’లో మంద కృష్ణ మాదిగ

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): గ్రూపు--1 ఫలితాలను వర్గీకరణ ప్రకారమే ప్రకటించాలని, ఈ విషయంపై పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కూడా కలుస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణతో పాటు క్రిమీలేయర్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని ఆయ న చెప్పారు.  గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ  ఇటీవల 100 మంది ఎంపీలు ప్రధాని మోదీని కలిసి వర్గీకరణ విషయం లో ఎలాంటి నిర్ణయిం తీసుకోరాదని విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు.

ఎదిగిన దళిత, గిరిజనులు పార్లమెంట్‌లో ఉంటే ఎదగని కులాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చట్టసభల్లోకి స్వతంత్రంగానే వెళతానని, ఇతర పార్టీల నుంచి వెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వర్గీకరణను వీలైనంత త్వరగా అమలు చేయాలని మంత్రి  రాజనరసింహ నేతృ త్వంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, కాంగ్రెస్‌లోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి విజ్ఞప్తి చేశామన్నారు.

వర్గీకరణను అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి అంగీకరించారన్నారు. ఇదే అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవాలని నూచించారని, ఖర్గేను ఎందుకు కలవమన్నారో తెలియదని పేర్కొన్నారు.  ఎస్సీ వర్గీకరణను ఏ కమిషన్ కూ డా వర్గీకరణను వ్యతిరేకించలేదన్నారు. న్యా య వ్యవస్థ న్యాయబద్ధంగా నిలబడిందన్నారు. బీసీల్లో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీల్లో వర్గీకరణ ఎందుకు ఉండకూడదనే పట్టుదలతో  ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు.  

పలు అంశాలపై ఉద్యమించాం.. 

 ఎమ్మార్పీఎస్ పోరాటం ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో  వికలాంగులు, వితంతువులు, వృద్ధుల పెన్షన్లు పెరిగాయన్నారు. ఆరోగ్య శ్రీ పథకం వచ్చిందన్నారు. రేషన్ బియ్యం 6 కిలోలకు పెరిగిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు, హత్యలపై ఎమ్మార్పీఎస్  ఉద్య మించిందన్నారు. దీంతో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిందని కృష్ణమాదిగ తెలిపారు.

మాలల కోసం పనిచేశాం.. 

  వర్గీకరణను మాలలు అడ్డుకుంటే తిరిగి రోడ్లమీదకు వచ్చి ఉద్యమం చేపడతామని కృష్ణ మాదిగ  హెచ్చరించారు. ఒక వైపు వర్గీకరణ కోసం ఉద్యమిస్తూనే.. మాలలపై దా డులు జరినప్పుడల్లా ఉద్యమం చేశామని తె లిపారు. తాను  చదువుకునే రోజుల్లోనే సొం త గ్రామంలో ఒక మాల మహిళపై అగ్రవర్ణాలు దాడి చేస్తే ప్రతిగా తాము కూడా దా డులు చేయడంతో జైలుకు వెళ్లినట్లు చెప్పా రు. మాలలపై కోదండరామ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపామని, మాల సా మాజిక వర్గం నేతలు పట్టించుకోలేదని తెలిపారు. వర్గీకరణకు మాల మేధావులు అడ్డు పడవద్దని, ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశా రు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విరాహత్‌అలీ, రాంనారాయణ, ఐజేయూ కార్యదర్శి నరేందర్ రెడ్డి, రాజేశ్, హెచ్‌యూజే అధ్యక్షుడు శివ శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.