calender_icon.png 3 February, 2026 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధి ఆధారిత కేంద్ర బడ్జెట్

03-02-2026 12:38:00 AM

స్వాగతించిన క్రెడాయ్ హైదరాబాద్

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్ పట్ల రియల్ ఎస్టేట్ డెవలపర్ల అత్యున్నత సంస్థ క్రెడాయ్ (హైదరాబాద్ ) హర్షం వ్యక్తం చేసింది. ఈ బడ్జెట్ మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధి, పట్టణ పరివర్తనపై బలమైన నిబద్ధతను ప్రదర్శిస్తోందని, అయితే గృహ నిర్మాణ రంగానికి సంబంధించి కొన్ని దీర్ఘకాలిక డిమాండ్లు ఇంకా పరి ష్కరించబడాల్సి ఉందని పేర్కొంది.

క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్ జైదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ బడ్జెట్ పట్టణాభివృద్ధి, ఏఐ, బయో ఫార్మా పరిశోధన వంటి భవిష్యత్తు సాంకేతికతలపై ప్రత్యేక దృష్టి సారిం చింది. ఐటీ, సాఫ్ట్వేర్ సేవలకు ప్రత్యేక ప్రయోజనాలు, డేటా సెంటర్లకు పన్ను సెలవులను ప్రకటించడం హైదరాబాద్ వృద్ధికి మరింత ఊతాన్ని ఇస్తుంది. అయితే, గృ హాల విక్రయాలను పెంచే అంశా లు, ముఖ్యంగా సరసమైన ధరల గృహాల విభాగంపై తగినంత శ్రద్ధ చూపలేదు. రాబోయే రోజుల్లో సరసమైన ధరల గృహాల కోసం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలపై మరిన్ని ప్రకటనలు వస్తాయని మేము ఆశిస్తున్నాము’ అని తెలిపారు.

క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్- ఎలెక్ట్ బి. జగన్నాథరావు మాట్లాడుతూ.. ‘కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యానికి బ్లూ ప్రింట్లా ఉంది. ’అందరికీ ఇల్లు’ మిషన్ పూర్తి స్థాయిలో విజయవంతం కావాలంటే, గృహ కొనుగోలుదారులు, డెవలపర్ల కోసం పన్ను హేతుబద్ధీకరణ వంటి ప్రత్యక్ష చర్యలు అవసరం’ అని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రధా న కార్యదర్శి క్రాంతి కిరణ్‌రెడ్డి మాట్లాడు తూ.. ‘బడ్జెట్ దీర్ఘకాలిక దృష్టితో, స్థిరమైన అభివృద్ధికి అనుగుణంగా ఉంది’ అన్నారు.