03-02-2026 12:39:35 AM
కాంగ్రెస్ అభ్యర్థులకు ‘బీఫామ్’లు అందజేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి
ఆమనగల్లు, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ఆమనగల్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పట్టణంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థులకు బి-ఫామ్లను (B-Forms) పంపిణీ చేశారు. ఎన్నికల ఇంచార్జ్ ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ వివరించాలని, గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల, బిఆర్‌ఎస్, బిజెపిల నిర్లక్ష్యం కారణంగా ఆమనగల్ ఏ విధంగా వెనుకబడిందో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, కాంగ్రెస్ జెండాను మున్సిపాలిటీపై ఎగురవేయాలని ఆయన పిలుపు నిచ్చారు.
డ్రా ద్వారా అభ్యర్థి ఎంపిక..
ప్రధానంగా జంగారెడ్డిపల్లి మున్సిపాలిటీ వార్డుకు సీనియర్ కాంగ్రెస్ నేత ఖాదర్, యువజన కాంగ్రెస్ నేత దొడ్డు కృష్ణ ఇద్దరు మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. ఇద్దరి అభ్యర్థులను ఒప్పించి పోటీలో ఉన్న ఇద్దరు ఆశ వాళ్ళ అభ్యర్థులను చీటీలపై రాసి వారి సమక్షంలోనే డ్రా తీశారు. అందులో దొడ్డు కృష్ణ యాదవ్ కు చీటీలో పేరు వచ్చింది. దీంతో ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నేత ఖాదర్ ను ఓదార్చి భవిష్యత్తులో పార్టీ అండగా ఉంటుందని దొడ్డు కృష్ణయ్య యాదవ్ను గెలిపించుకొని తీసుకొని రావాలని ఆయన కోరారు. అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పట్టణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని నేతలు ధీమా వ్యక్తం చేశారు.
బీ అందుకున్న అభ్యర్థుల జాబితా ఇలా...
1 వార్డు నేనావత్ విజయ రాగ్య నాయక్, 2 వార్డు కాలే రాజేశ్వరీ మహేష్ 3వార్డు నేనావత్ విజయ చందు నాయక్,4వార్డు దొడ్డు కృష్ణ యాదవ్,5వార్డు ఒగ్గు మహేష్, 6 వార్డు వర్త్యావత్ మల్లేష్ నాయక్, 7 వార్డు V.కృష్ణ నాయక్, 8 వార్డు వసుపుల మానయ్య,9 వార్డు గుర్రం కేశవులు, 10 వార్డు కోవూరు అనిత శ్రీనివాస్ రెడ్డి,11 వార్డు నల్లపోతుల అంజలి గణేష్ 12వార్డు అప్పం శీను 13 వార్డు V. శారద లక్ష్మణ్ నాయక్,14 వార్డు కాలే మల్లయ్య,15.వార్డు రేవతి శివ లింగం. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి మరియు మండల పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.