18 August, 2026 | 6:29 PM

ద్వాదశ రాశిఫలాలు

16-06-2024 02:30 AM

16-.06.-2024 నుండి 22.-06-.2024 వరకు 

రామడుగు రంగన్న సిద్ధాంతి

మేషం:-

ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి శుభంగా ఉంది. నూతన బాంధవ్యాలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవు తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. బంగారం లాంటి వస్తువులు కొంటా రు. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు మంచివారితో వివా హం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నా లు ఫలిస్తాయి. -ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు నూతన వ్యాపారం చేస్తారు. లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువులో కొత్త విషయాలు తెలుసుకుంటారు. రైతులు శుభవార్తలు వింటారు. మొ త్తం మీద ఈ రాశివారికి 82% అనుకూలత, 18 శాతం ప్రతికూలత ఉంది.  

వృషభం: 

--ఈ రాశివారికి ఈవారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. బంధువులతో భేదాలు కలుగుతాయి. ప్రారంభించిన పనులు అధిక శ్రమతో పూర్తవుతాయి. యువతీ యువకులకు పెండ్లి విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థులు పట్టుదలతో కృషి చేయాలి. విదేశీ ప్రయత్నాలు ఫలించవు. రైతులు జాగ్రత్తగా ఉండాలి. అందరికీ పొదుపు అవసరం. భూసంబంధ సమస్యలతో అశాంతిగా ఉంటారు. కావలసిన వారు మోసం చేస్తారు. మొత్తం మీద ఈ రాశివారికి 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది.

మిథునం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. చేసే పనులలో కొంత పురోగతి ఉంటుంది. ధన వ్యయమవుతుంది. బంధుమిత్రులతో మంచిగా ఉంటారు. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో జాప్యం జరుగుతుంది. విద్యార్థులు శ్రద్ధతో చదవాలి. వ్యాపారస్తులు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్లకు లోనవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

కర్కాటకం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి శుభకరంగా ఉంది. అనేక మంచి కార్యక్రమాలు చేస్తారు. ప్రయాణాలు చేస్తారు. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యక్రమాలవల్ల ధన వ్యయమవుతుంది. బంధువులతో ఆనందంగా ఉంటారు. యువతీ యువకులకు అనుకున్నట్లు వివాహాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఇష్టంతో చదువుతూ, ఉన్నతిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులకు, రైతులకు శుభకరమేకాక లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది. 

సింహం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సా మాన్యంగా ఉన్నది. వృథా ధన వ్యయవుతుంది. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. అపవాదులకు లోనవుతారు. ప్రయాణాలవల్ల అనారోగ్యం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తొందరగా ఫలించవు. విద్యార్థులు చదువు లలో ముందుకు వెళతారు. వ్యాపారస్తులకు, రైతులకు అనుకున్నలాభాలు రావు. ఉద్యోగస్తులకు శ్రమ అధికమై ఫలం స్వల్పంగా లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశివారికి 35 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది. 

కన్య:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు లభిస్తాయి. పూజలు, అన్నదా నాలు చేస్తారు. సాధు సత్పురుషులను కలుస్తారు. మంచివారితో సంబంధం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శుభకార్యాలు చేస్తారు. భూమి కొనుగోలు అవకాశం వుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివా హ నిశ్చయాలు జరుగుతాయి. విద్యార్థులకు చదువు, ఉద్యోగాలలో ఉన్నతి ఉంది. వ్యాపారస్తులకు, రైతులకు అధిక లాభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది. 

తుల:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధన సంబంధ సమస్యలు ఏర్పడతాయి. పెట్టుబడులకు సరైన సమయం కాదు. చేసే పనులలో జాప్యం జరుగుతుంది. బం ధువులతో వైరుధ్యాలు కలుగుతాయి. దూరప్రయాణాల వల్ల అనారోగ్యం కలుగుతుంది. నిందలకు లోనవుతారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివా హ విషయాలలో అధిక ప్రయత్నం అవసరమవుతుంది. విద్యార్థులు పట్టుదల తో చదువాలి. ఉద్యోగస్తులకు కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారస్తులకు, రైతులకు మంచి కాలం కాదు. మొత్తం మీద ఈ రాశివారికి 30 శాతం అనుకూలత, 70 శాతం ప్రతికూలత ఉంది. 

వృశ్చికం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. శ్రమ అధికమవుతుంది. భూసంబంధ కలహాలు ఏర్పడతాయి. కొన్ని శుభకా ర్యాలు చేస్తారు. ధనవ్యయం అవుతుంది. శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలతో అస్వస్థతకు లోనవుతారు. యువతీ యువరులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు ఉన్నత ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు, రైతులకు లాభనష్టాలు సమానంగా ఉంటా యి. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40% ప్రతికూలత ఉంది. 

ధనుస్సు:-

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు. బంగారం, వాహనాలు లాంటి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు, వేడుకలు చేస్తారు. ధన వ్యయమవుతుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగాలు, వివాహాలు లాభిస్తాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. తలచిన పనులు పూర్తవుతాయి. సంతోషకర వార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం, వాహన యోగం ఉన్నాయి. మంచివారితో పరిచయాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. -విద్యార్థులు చదువులలో శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు, రైతులు అనుకూల లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

కుంభం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సా మాన్యంగా ఉంది. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడి విరోధాలు సంభవిస్తాయి. నిర్ణయాలు తీసుకొనే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. మిత్రులతో విరోధాలు ఏర్పడతాయి. ఆశావహ పరిస్థితులు ఉంటాయి. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఉన్నత పురోగతిని పొందుతారు. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది.

మీనం:

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉం ది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. చేసే పనులలో ఆటంకాలు కలు గుతాయి. శుభకార్య నిమిత్తమై ఖర్చులు చేస్తారు. భూసంబంధ సమస్యలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువుల్లో ప్రయత్నశీలురై ఉంటారు. వ్యాపారస్తులకు, రైతులకు కాలం కొంతమేరకే అనుకూలించి స్వల్పలాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు శభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.