గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయాలి
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ఉన్న గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. లెక్చరర్లు లేకపోవడంతో ప్రభుత్వ కళా శాల విద్య కుంటుపడుతుందని, దీం తో సర్కార్ చదువుల వైపు విద్యార్థులు మొగ్గు చూపరని తెలిపారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పర్మినెం ట్ లెక్చరర్లు లేని కళాశాలలు 25 వర కు ఉన్నాయని, 3వేల మంది గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో వారు రోడ్డున పడ్డారని, విధు ల్లోకి తీసుకుని వారి జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థి జీవితంలో ఇంటర్ చాలా కీలకమని, ప్రైవేటు కళాశాలలు వ్యాపార ధోరణితో విద్యార్థులను ఫీజుల పేరుతో దోచుకుంటున్నారని మండిపడ్డారు.




