‘కల్యాణలక్ష్మి’ పంపిణీ అధికారం ఎమ్మెల్యేలకే ఇవ్వాలి
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : నియోజక వర్గంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అధికారం ఎమ్మెల్యేలకే ఇవ్వాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. జీవో 18 ప్రకా రం ఎమ్మెల్యేలకే అధికారం ఉంటుందని, లేదంటే మాపార్టీ ఎమ్మెల్యేల మంతా న్యాయస్ధానానికి వెళ్తామని హెచ్చరించారు. తన నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు ఇస్తే వాటి వినియోగంలో అధికార పార్టీ నేతల పెత్తనం సరికాదన్నారు. కొడంగల్‌లో సీఎం సోదరుడు ఏ హోదాలో చెక్కులు పంపిణీ చేస్తున్నారని నిలదీశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి పార్టీ మారుతున్నట్లు జరిగిన ప్రచారంపై స్పందిస్తూ బీఆర్‌ఎ స్‌ను వీడే ప్రసక్తిలేదని, కొం తమంది అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించి పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. తాను కేసీఆర్ బాటలో నడుస్తానని, పార్టీ బలోపేతం కృషి చేస్తానన్నారు.




