11 August, 2026 | 1:53 AM

దేశ సంపదను దోచుకుంటున్న గుజరాతీలు..

11-08-2026 12:42 AM

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి 

అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 10: దేశ సం పదను గుజరాతీలు దోసుకుంటున్నారని సీ పీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు  ముత్యాల యా దిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసి స్తూ ‘క్విట్ ఇండియా స్పూర్తితో ఏఐటీయూ సీ ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమానికి పి లుపునిచ్చారు. అందులో భాగంగానే అబ్దుల్లాపూర్ మెట్  ఏఐటీయూసీ మండల కమి టీ పిలుపుమేరకు రావి నారాయణరెడ్డి కాలనీలో పూలే; అంబేద్కర్ విగ్రహాల వద్ద జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పబ్బతి లక్ష్మణ్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి హాజరై మాట్లాడుతూ... దేశ సంపదను గుజరాతీలు దోచుకుని స్వీ స్ బ్యాంకులలో దాచుకుంటున్నారన్నారు. గ తంలో ప్రధాని  దేశంలో ఉన్న బ్లాక్ మనీని పేద ప్రజలకు పంపిణీ చేస్తానని ప్రగల్బాలు  పలికారని విమర్శించారు. మోడీ పాలనలో రైతు వ్యతిరేక చట్టాలతో ఎంతోమంది రైతులు నష్టపోయారని.. గతంలో పోరాడి సాధించుకున్న 44 కార్మికుల చట్టాలను సరళీకరణ పేరుతో 4 లేబర్ కోడ్ లు అమలు చేస్తూ.. 8 గంటలకు బదులు.. 12 గంటల పని విధానం అమలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు  అజ్మీర్ హరి సింగ్  నాయక్, ప్రసాద్, రాములు తదితరులు పాల్గొన్నారు.