11 August, 2026 | 2:48 AM

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇసుక రవాణాను అడ్డుకోవాలి

11-08-2026 12:42 AM

రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు యాదయ్య గౌడ్

ఆటోనగర్‌లో ‘జైల్ భరో’ కార్యక్రమం

ఎల్బీనగర్, ఆగస్టు 10: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు, రవాణా రంగంపై తీసుకొస్తున్న చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘ జైల్ బరో’ కార్యక్రమంలో భాగంగా  వనస్థలిపురం లోని ఆటో నగర్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమా నుల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి సప్పిడి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారిపై తెచ్చిన వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఇసుక రీచ్లలో జరుగుతున్న అక్రమ డబ్బుల వసూళ్లను అరికట్టాలని, ఇసుక రీచ్లలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని, హైదరాబాద్ చుట్టుపక్కల ఫిల్టర్ ఇసుక తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇసుక లారీ యజమానులు, డ్రైవర్లు, ఇసుక ఖాళీ చేసే కార్మికులు పాల్గొన్నారు.