జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి ఉపయోగించాలి
కేపీఆర్‌ఐటీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
ఘట్‌కేసర్, ఆగస్టు 10 (విజయక్రాంతి) : విద్యార్థులు కళాశాలలో పొందిన జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి ఉపయోగించాలని ము ఖ్య అతిథి భూషణ్ రెడ్డి అన్నారు. ఘట్ కేస ర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి, ఘనపూర్‌లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ లో గ్రాడ్యుయేషన్ డే 2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రయాణంలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిన ఈ కార్యక్రమంలో పట్టభద్రులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వేడు కలకు ముఖ్యఅతిథిగా భూషణ్ రెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా మైక్రోసాఫ్ట్ ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ మేనేజర్ రంజిత్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు కేపిఆర్‌ఈఎస్ చైర్మన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్, సెక్రటరీ కొమ్మూరి రాకేష్, డైరెక్టర్ స్ట్రాటజీస్ కొమ్మూరి దివ్య శ్రీ, సీఈవో ప్రొఫెసర్ సి.డి. నాయుడు, డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్ తదితర యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి భూషణ్ రెడ్డి మాట్లాడుతూ..
విద్యార్థులు కళాశాలలో పొందిన జ్ఞానాన్ని సమా జ అభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు. కేపిఆర్‌ఐటి విద్యార్థులను విద్యాపరంగా మాత్రమే కాకుండా విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత కలిగిన సమర్థులైన యువతగా తీర్చిదిద్దడమే సంస్థ లక్ష్యమని చైర్మన్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం పట్టభద్రులతో గ్రాడ్యుయేషన్ ప్రతిజ్ఞ చేయించి, విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు అందజేశారు. అత్యుత్తమ విద్యా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్ మెడల్స్ ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.






