6 June, 2026 | 12:00 PM

తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రదాత గుండా నాగరాజు

06-06-2026 10:51 AM

మంథనిలో  13వర్థంతిలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నల్మాసు ప్రభాకర్ 

మంథని, జూన్0 6 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన అమరవీరుడు గుండా నాగరాజు ఆత్మబలిదానం చిరస్మరణీయమని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నల్మాసు ప్రభాకర్ అన్నారు. శనివారం మంథని పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న గుండా నాగరాజు 13వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నల్మాసు ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో మంథని ప్రాంతంలో ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలో నాగరాజు కీలక పాత్ర పోషించారని, ఆయన అంకితభావం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన గొప్ప పోరాటయోధుడని ఆయనను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకుడు బెజ్జంకి డిగంబర్, మంథని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మరియు కౌన్సిలర్ ఎల్లంకి వంశీ, పిఎసిఎస్ డైరెక్టర్ రావికంటి సతీష్, ఒల్లాల అశోక్ తదితర ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.