6 June, 2026 | 11:45 AM

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన న్యాయవాది నాయకులు

06-06-2026 10:35 AM

బోథ్, జూన్ 6(విజయక్రాంతి): మండలంలోని అందూర్ గ్రామానికి చెందిన కుడుమేత బండు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న న్యాయవాది పంద్రం శంకర్ తో పాటు కరత్వాడ సర్పంచ్  విశ్వేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ దేవరవులు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మృతి కి గల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆందోళన చెందవద్దని అండగా ఉంటామంటూ భరోసా కలిగించారు. కార్యక్రమంలో మడవి లక్ష్మణ్ ప్రకాష్ మడవి దేవరావ్ పోతలింగులతో పాటు సర్పంచ్ పెందూర్ పృథ్వీరాజ్ లు పాల్గొన్నారు