23-01-2026 12:00:00 AM
రాంచి, జనవరి 22 : ఝార్ఖండ్‌లో తుపాకుల మోత మోగింది. నిశ్శబ్దంగా ఉన్న కీకారణ్యం ఒక్కసారిగా తూటాల శబ్దంలో ఉలిక్కిపడింది. జార్ఖండ్‌లోని చైబాసా సమీ పంలోని సింగ్‌భూమ్ జిల్లా సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో 15మంది మా వోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మ వోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ అలియాస్ అనల్ ఉన్నాడని సమాచారం. మృతుల వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఈ ఎన్‌కౌంటర్ తో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వివరాలు.. సింగ్‌భూమ్ జిల్లాలోని సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఉద యం 10:30 గంటల ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ కోబ్రాబలగాలు సంయుక్తంగా కూం బింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో, బలగాలు దీటుగా ప్రతిఘటించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది.
పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం
ఈ ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు మృతిచెందారని అధికారులు తెలిపా రు. ఘటన అనంతరం మృతుల వద్ద నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, నాసా, రెండు 303 రైఫిళ్లు, బీజీఎల్ లాంచర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌తో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని భద్రతావర్గాలు పేర్కొన్నాయి. మృతుల్లో మవోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ అలియాస్ అనల్ ఉన్న ట్లు పేర్కొంటున్నాయి.
ఇతడిపై ఆరు రాష్ట్రా ల్లో రూ.5కోట్ల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా దళాలపై దాడులు చేయడంలో మాంఝీ దిట్ట అని సమాచా రం. ఎన్‌కౌంటర్‌పై జార్ఖండ్ డిప్యూటీ సీఎం బసంత్ సొరేన్ స్పందించారు. బలగాల ఆపరేషన్లతో మావోయిస్టులు వెనుకడుగు వేస్తున్నారని అన్నారు. అటవీ ప్రాంతాల్లో శాంతి స్థాపన దిశగా ఎన్‌కౌంటర్ కీలక ముందడుగని ఆయన వ్యాఖ్యానించారు.